Archive for the ‘న్యూస్ & మీడియా’ Category

పైరసీపై సినిమాటికా హైటెక్ యుద్ధం

 

దక్షిణ ఆసియా దేశాలలో విపరీతంగా వూడలు వేస్తున్న పైరసి భూతం సినిమా రంగంలోని ప్రతి ఒక్కరని, అనేక వేల సంభంధిత నిపుణులు, కార్మికుల జీవితాలపై విష ప్రభావం చూపుతుంది. పైరసి ఒక నటుడి తలసరి ఆదాయం తగ్గుదలకు నేరుగా ప్రభావం చేస్తుంది. తిరిగి ఒక మంచి ఆరోగ్యకర వ్యవస్థగా సినిమా ఇండస్ట్రీ మారటానికి ఈ సమస్యని సమూలంగా పరష్కరించడం చాలా అవసరం.

ప్రసిద్ధ నటులు ఇప్పటికే పైరసీని అరికట్టటానికి  నడుం బిగించి పైరసీ జరిగే ప్రదేశాలపై దాడిచేసి సంభందిత సీడీలను ధ్వశం చేయడం మనము వార్తలలో వింటున్నాము. అయినప్పటికి, ఈ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. పైరసీ సినిమాల చిత్రీకరణ, పంపిణీ చాపకింద నీరులా రహస్యంగా జరుగుతూ వచ్చాయి.

సినిమాటికా డిజిటల్స్ పైరసీని ఆరంభ దశలోనే నిర్మూలించడంపై దృష్టి సారించింది. సినిమాటిక డిజిటల్స్, క్యూబ్ సినిమా సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో, పైరసీ జరిగే థియేటర్ ప్రదేశం, సమయాన్ని గుర్తించ కలుగుతుంది. అ సమాచారం నిదితులను గుర్తించి, పైరసీ ప్రయత్నాన్ని మొగ్గదశలోనే తుంచివేయటానికి ఉపయోగపడుతుంది.

క్కూబ్ డిజిటల్స్ ప్తెరసిని అడ్దుకునేందుకు కావలసిన అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియేగిస్తుంది. ఇందులో దృశ్యాలు ఎంక్రీప్ట్, వాటర్ మార్క్ చేయబడతాయి. అంతేకాదు, ప్తెరసి అరికట్టడం వల్ల మీ ధియేటర్ కి వచ్చేవరి సంఖ్య బాగా పెరుగడంతో పాటు మీ థియేటర్ సురక్షిత  థియేటర్‌గా పేరు పొందుతుంది.

సినిమాటికా డిజిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లు వెంకటేష్ మాట్లాడుతూ, “సినిమా పైరసీని మొదలు దశలోనే తుంచివేయటం చాలా ముఖ్యం” అని అన్నారు. “కాని ఈ పరిజ్ఞానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకుంటేనే గణనీయమైన ఫలితాలు వస్తాయి. అందుకే సినిమాటికా ఈ పరిజ్ఞానాన్ని తక్కువ ధరలలొ అందుబాటులో వుండేలా రాయతీలు అందజేస్తుంది”, అని ఆయన వాఖ్యానించారు.

Read More