మా గురించి


సినిమాటికా డిజిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్

అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన వినోదాన్ని జనానికి అందుబాటులోకి తేవడం సినిమాటికా డిజిటల్స్ ను స్థాపించడం వెనుక వున్నప్రధాన ఉద్దేశం. అధునిక పరిజ్ఞానం వినూత్నమైన రీతిలో అందరికి చేరువగా వుండడం, చక్కటి భాద్యతాయుతమైన సేవ, సరసమైన ధర, మంచి ఫైనాన్స్ సౌకర్యం వీటన్నింటిని కలిపి సినిమాటికా డిజిటల్స్ మీ ముందుకు తెస్తుంది. అత్యున్నత ప్రమాణాల వినోదం అందించే యంత్రాంగాన్ని ఇక మీరు తేలికగా ఎంచుకొవచ్చు. వినోద రంగంలొ వున్న వాణిజ్య అవకాశాలను సంపూర్ణంగా అందిపుచ్చుకొవడానికి, సామాన్యులకు కూడా చక్కటి విలువైన వినోదాన్ని ఆస్వాదించడానికి సినిమాటికా తొడ్పడుతుంది.

క్యూబ్ సినిమా

క్యూబ్, భారత కంపెనీ అయిన రియల్ ఇమేజ్ మీడియా టెక్నాలజీస్ యొక్క సబ్సిడరీ సంస్ధ. మీడియా ఎంటర్ ట్తెన్ మెంట్ రంగాల్లో రియల్ ఇమేజ్ కి వున్న దశాబ్దాల అనుభవసారం, ఈ రంగాల్లో సాంకేతక పరిజ్ఞానం, అగ్రశ్రేణి కంపెనీలతో దానికున్న చక్కటి సంబంధాలు క్యూబ్ సొంతం. క్లిష్టమైన సాంకేతిక ప్రక్రియలను చాలా సునాయాసంగా నిర్వహించగలిగే నైపుణ్యం వున్న రియల్ఇమేజ్ మీడియా, టైక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ అన్న విషయం అందరికీ తెలిసిందే. క్యూబ్ సినిమాకు అంకితభావతో పనిచేసే సమర్ధవంతమైన సాంకేతిక బృందం వుంది.దానితో పాటు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాలు వున్నాయి. ఈ రెండింటి మేళవింపుతో అత్యుత్తమ డిజిటల్ సినిమాను విజయవంతంగా నిర్వహించ గలుగుతోంది.




పైరసీపై సినిమాటికా హైటెక్ యుద్ధం

  దక్షిణ ఆసియా దేశాలలో విపరీతంగా వూడలు వేస్తున్న పైరసి భూతం సినిమా రంగంలోని ప్రతి ఒక్కరని, అనేక వేల సంభంధిత నిపుణులు, కార్మికుల జీవితాలపై విష ప్రభావం చూపుతుంది. పైరసి ఒక నటుడి తలసరి ఆదాయం తగ్గుదలకు నేరుగా ప్రభావం చేస్తుంది. తిరిగి ఒక మంచి ఆరోగ్యకర వ్యవస్థగా సినిమా ఇండస్ట్రీ మారటానికి ఈ సమస్యని సమూలంగా పరష్కరించడం చాలా అవసరం. ప్రసిద్ధ నటులు ఇప్పటికే పైరసీని అరికట్టటానికి  నడుం బిగించి పైరసీ జరిగే ప్రదేశాలపై […]

Read More

Download Brochure

English Brochureతెలుగు Brochure